ఐ టి ఐ లో మూడవ విడత ప్రవేశాలకు దరఖాస్తులు
పెద్దపల్లి జిల్లా లోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పారిశ్రామిక శిక్షణ సంస్థలలో ఆగస్టు 2024-25 వ విధ్యా సంవత్సరం ప్రవేశాలకు మిగిలి వున్న సీట్ల కోసం మూడవ విడత 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ ssc మెమో, బోనఫైడ్, కాస్ట్, ఆధార్, TC, ఇతర ధ్రువపత్రాలను స్కాన్ చేసి ఆన్ లైన్ నందు దరఖాస్తులు చేసుకొనవలెను. ఇట్టి దరఖాస్తులు ఈ నెల 02 -08-2024 నుండి 12-08-2024 వరకు iti.telangana.gov.in website నందు ఆన్ లైన్ లో వెరిఫికేషన్ ఫీజు Rs.100 /- చెల్లించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. 01-08-2024 నాటికి 14 సం.ల వయసు పూర్తి అయినవారు అర్హులు. అభ్యర్థులు తమ సొంత సెల్ ఫోన్ నెంబర్ మరియు ఈ-మెయిల్ ఐడి ఉపయోగించగలరు. అప్లై చేసినపుడు ఉపయోగించినటువంటి ఫోన్ నెంబర్ , ఈ-మెయిల్ ఐడిలను ఐ.టి.ఐ పూర్తయ్యేవరకు మార్చకూడదు. మార్చినచో అడ్మిషన్ కాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. రిజిస్ట్రే షన్ చేసిన ప్రతి అభ్యర్థి తమకు నచ్చిన ట్రేడ్లలో ఎక్కువ ఐ.టి.ఐ లలో ఆప్షన్లను ఎంచుకోగలరు.
కావున ఇట్టి అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగపరుచుకోవాలని పెద్దపల్లి ప్రభుత్వ ఐ.టి.ఐ ప్రిన్సిపల్/కన్వీనర్ శ్రీ బుసిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలియపరిచినారు.
ప్రిన్సిపల్/కన్వీనర్
