విలేజ్​ ప్లేయర్స్​ కు వరం ఖేలో ఇండియా

Uncategorized

 

 ‘ ఖేలో ఇండియా’కు ప్రచారం కల్పించాలే…

= విలేజ్ ప్లేయర్స్ను గుర్తించాలే

= ప్రోగ్రాంను స్టేట్ అడాప్ట్ చేసుకోవాలి

= యాప్పై అవగాహన పెంచాలే

అర్హత ఉండి ఆడగల సత్తా ఉన్నా అవకాశాలు రాని గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తేసేందుకు భారత ప్రభుత్వం ఆవిష్కరించిన విప్లవాత్మక క్రీడా పథకం ‘ఖేలో ఇండియా’ .  దేశ వ్యాప్తంగా ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం ఖేలో ఇండియా ప్రోగ్రాంకు గుర్తింపు  దక్కడం లేదు. స్కూల్​ నుంచి కాలేజ్​ వరకు గ్రామీణ, పట్టణ క్రీడాకారులను వెలికి తీసి జాతీయ స్థాయి అవకాశాలను కల్పించే లక్ష్యంతో ఈ ప్రోగ్రాం తీసుకొచ్చారు. అంతర్జాతీయ క్రీడల్లో విలేజ్​ ప్లేయర్స్​ను పాల్గొనేలా తయారు చేయాలనే కేంద్ర సర్కార్​ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతీ ఆటగాడి సామర్థ్యాలను గుర్తించి వారి ప్రతిభా పాటవాలను నమోదు చేసుకోవడానికి వీలుగా ఖేలో ఇండియా యాప్​ను అందుబాటులోకి తీసుకొచ్చారు. స్టేట్​ గవర్నమెంటు మాత్రం ఈ ప్రోగ్రాం పట్ల అంటి ముట్టనట్లు వ్యవహరిస్తుంది. ఈ యాప్​పై ఇంకా విస్తృత ప్రచారం జరుగాలని పలువురు క్రీడాకారులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

 

ఎస్జిఎఫ్కు బదులుగా….

కీడారంగానికి ఆయువు పట్టు పాఠశాల దశ, ప్రతీ విద్యార్థిని ఆటల వైపు ఆకర్షితులను చేస్తూ వారిని ప్రోత్సహించడానికి  ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టాయి. ఇప్పటికే క్రీడారంగంలో ఎన్నో విధానాలున్నాయి. 1952లోనే  ప్రారంభించిన ఎస్​జిఎఫ్​ (స్కూల్​ గేమ్స్​ ఫెడరేషన్​) ద్వారా క్రీడలు సంపూర్ణ ఫలితాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎస్​జిఎఫ్​లో కూడా గ్రామీణ, పట్టణ క్రీడాకారులను ఎంపిక చేసే ప్రక్రియ ఉంది. ఈ క్రమంలో మంచి క్రీడాకారులు కూడా నిరాధరణకు గురైన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో ఖేలో ఇండియా యాప్​ ద్వారా క్రీడాకారులు తమ ప్రతిభను యాప్​లో నమోదు చేసుకున్నట్లయితే అర్హులైన వారికి తప్పకుండా అవకాశాలు దక్కుతాయి.

 

ఫిట్ ఇండియా లక్ష్యంగా….

క్రీడాకారులను తయారు చేయడమే కాకుండా ప్రతీ పౌరుడు ఫిట్​నెస్​ కలిగి ఉండి ఆరోగ్యభారతావని నిర్మించాలనే లక్ష్యంతో  ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర క్రీడలు, యువజన మంత్రిత్వశాఖ  ‘ఖేలో ఇండియా’ యాప్​ రూపొందించింది. ఇందులో నాలుగు ఫీచర్లు ఉన్నాయి. క్రీడలకు సాంకేతికతను జోడించి 18 క్రీడాంశాలపై సమగ్ర సమాచారాన్ని పొందుపరిచారు. క్రీడా చరిత్ర, నియమ నిబంధనలు, ప్రసిద్ది గాంచిన క్రీడాకారుల వివరాలుంటాయి. బడికి వెళ్లే చిన్నారుల ప్రతిభ సామర్థ్యాలను గుర్తించి వారు ఏ క్రీడల్లో రాణిస్తారనే విషయాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు కూడా ఈ యాప్​ ఎంతగానే ఉపకరిస్తుంది.

 

యాప్లో  నాలుగు ఫీచర్లు…

ఈ యాప్​ నాలుగు ఫీచర్లు కలిగి ఉంటుంది.  మొదటిది లర్నింగ్​, ఇందులో ఆర్చరీ, అథ్లెటిక్స్​, బ్యాడ్మింటన్​, బాస్కెట్​బాల్​, బాక్సింగ్​, ఫుట్​బాల్​, జిమ్నాస్టిక్స్​, హాకీ, కబడ్డి, ఖోఖో, లాన్​టెన్నిస్​, షూటింగ్​, స్విమ్మింగ్​, వెయిట్​లిఫ్టింగ్​, టేబుల్​టెన్నిస్​, వాలీబాల్​, రెజ్లింగ్ క్రీడలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఆయా క్రీడల చరిత్ర, నియమాలు, క్రీడా కొలతలు, స్కోరింగ్​రూల్స్,  గెలుపు ఓటముల ప్రమాణాలు తదితర అంశాలపై సమాచారం పొందుపరిచి ఉంటుంది.

క్రీడా సౌకర్యాలు; దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న క్రీడా సౌకర్యాల సమాచారం సాయ్​ (స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా)  సెంటర్​లతో పాటు గోపిచంద్​ లాంటి ప్రైవేటు అకాడమీల సమాచారం సైతం ఇందులో పొందు పరిచారు. ఆసకర్తి గల క్రీడాంశాలు, సౌకర్యాలు ఈ యాప్​లో తెలుసుకోవచ్చు.

 

గెట్ఫిట్; ఇందులో 5 నుంచి 8,9,18 వయస్సు కలిగిన పిల్లలు పాఠశాలలు, పలు పరీక్షలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. బీఎంఐ టెస్ట్​ ఫ్లెక్సిబిలిటీ, 600 మీటర్ల రన్​, 50 మీటర్ల స్టాండింగ్​ స్టార్ట్​, ఎండ్యులెన్స్​, ఫుష్​అప్స్​,  లాంటి పరీక్షల విధానం వీడియాల ద్వారా వివరించారు. ఔత్సాహికులు తాము సాధించిన ఫలితాలను నమోదు చేసుకోవచ్చు. ఫిట్​నెస్​తో పాటు పౌష్టికాహారం సమాచారం సైతం అందుబాటులో ఉంటుంది.

 

సోషల్ మీడియా; సాంకేతికత ఆధారంగా తాజా సమాచారాన్ని సోషల్​ మీడియా ద్వారా తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ ఫీచర్​ ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను వివిధ శిక్షణ కేంద్రాలకు ఎంపిక చేసే వెసులుబాటు ఉంటుంది.