బాలికలు, మహిళల రక్షణకు మరో ముందడుగు
= భరోసా సెంటర్లతో విమన్ ప్రొటెక్షన్
= ఫోక్సో చట్టంపై అవగాహన కల్పించే దిశగా
= మహిళలకు సోషల్ సెక్యూరిటీ పెంచేలా చర్యలు
= బాధితులకు అందుబాటులో ఆన్లైన్ కౌన్సిలింగ్
= స్టేట్ వైడ్ మరో 12 సెంటర్ల ప్రారంభం
మహిళలు, బాలికలకు అండగా ఉంటూ సమస్యలు ఎదుర్కొంటున్న బాధితులకు సోషల్ సెక్యూరిటీ పెంచడానికి పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. ఇప్పటికే పోలీసుశాఖ ఆద్వర్యంలో షీటీంలు, సఖి సెంటర్ల ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నారు. అలాగే భరోసా సెంటర్ల ఏర్పాటు ద్వారా నిరంతరం మహిళల రక్షణ కోసం లీగల్, సైకాలజిస్ట్, మెడికల్ సౌకర్యాలతో పాటు ముగ్గురు సపోర్టర్లు అందుబాటులో ఉంటారు. సొసైటీలో జరుగుతున్న క్రైం రేటులో ఎక్కువగా మహిళలు, బాలికలపై అత్యాచారాలు, వేధింపుల కేసులే నమోదవుతున్నాయి. ఇండ్లు, రోడ్లు, కాలేజీలు, స్కూళ్లల్లో బాలికల మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. కానీ బాధితులు ఎవరూ కంప్లయింట్ చేయడం లేదు. ఈ క్రమంలో మైనర్ల మీద జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించిన ఫోక్సో చట్టంపై అవగాహన పెంచేలా పోలీసుశాఖ చర్యలు తీసుకోనుంది. హైదరాబాద్ వరకే పరిమితమైన భరోసా సెంటర్లను జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసి సమస్యలను సున్నితంగా పరిష్కరించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. సమస్యలు ఎదురైనా మహిళలు, బాలికలు ఎవరికి చెప్పుకోలేక మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి వారి కోసం భరోసా సెంటర్ తోడుగా ఉంటుందని పోలీసు అధికారులు చెప్తున్నారు. సమస్యను బహిర్గతం చేయకుండా బాధితుల ఉనికి బయటకు తెలియకుండా పరిష్కరించడం భరోసా కేంద్రాల ముఖ్య ఉద్దేశ్యమంటున్నారు. ఇన్వెస్టిగేషన్లో సీక్రసీ ఉంటుందంటున్నారు. బాధితులకు డైరెక్ట్ కౌన్సిలింగ్‌తో పాటు ఆన్లైన్ కౌన్సిలింగ్ కూడా అందుబాటులో ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు.
సీక్రెట్ ఇన్వెస్టిగేషన్…
లైంగిక దాడులకు గురైన మహిళలు, బాలికలకు భరోసా, రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా భరోసా కేంద్రాలు స్టార్ట్ చేశారు. పోలీసు ఉమేన్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో భరోసా కేంద్రాలు నిర్వహించనున్నారు. భరోసా కేంద్రం లైంగిక దాడులకు గురైన బాధితులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తారు. ఇందులో భాగంగానే భాదితులకు న్యాయపరమైన సహకారంతో పాటు వైద్య సహకారాన్ని అందిస్తారు. వీటితో పాటు బాధితులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. అవసరంనుకుంటే బాధితులకు భరోసా కేంద్రంలో ఆశ్రయం కల్పించబడటంతో పాటు బాధితులకు ప్రభుత్వం నుంచి పరిహారన్ని అందించడం జరుగుతుంది.ఈ కేంద్రంలో లీగల్, మెడికల్ సిబ్బంది తో పాటు ఇతర సహాయ సిబ్బందికి సంబందించి పూర్తిగా మహిళలు విధులు నిర్వహిస్తారు. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లనవసరం లేకుండా బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. జరిగిన సంఘటన బాధితుల మైండ్‌లో లేకుండా డైరెక్ట్‌గా, లేదా ఆన్లైన్లో కౌన్సిలింగ్ ఇస్తారు.
విమన్ రిలేటెడ్ కేసులే…
ప్రస్తుతం ఏ కేసు చూసిన విమన్ రిలేటెడ్ కేసులే నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో జరుగుతున్న నేరాల్లో ఎక్కువగా మహిళల పాత్రలే కన్పిస్తున్నాయి. మహిళలు, బాలికలకు చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది మహిళలు ఎదుటి వారి మాటలకు మోసపోయి, హత్యలకు గురుతున్నారు, అలాగే హత్యకేసుల్లో నింధితులుగా ఉంటున్నారు. ఆకర్షనకు లోనవుతున్న మైనర్ బాలికలు, వారికి తెలియకుండానే సమస్యల్లో ఇరుక్కుంటున్నారు. కానీ సమస్యను సంబంధిత శాఖ అధికారులకు చెప్పడానికి వెనుకాడుతున్నారు. విమెన్ రిలేటెడ్ కేసులు తగ్గించడం, మైనర్ బాలికలకు అండగా ఉండటానికి భరోసా కేంద్రాలు ఉపయోగపడుతాయని పోలీసు అధికారులు చెప్తున్నారు. బాలిక సంరక్షణ కోసం ఏర్పడ్డ ఫోక్సో యాక్ట్ గురించి, రానున్న రోజుల్లో కాలేజీలు, స్కూళ్లల్లో బాలికలకు అవగాహన కల్పించనున్నారు. అలాగే ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడంతో పాటు కంప్లయింట్ చేసే ధైర్యాన్ని మహిళలు, బాలికల్లో కలిగేలా క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్తున్నారు.
మహిళల్లో మనోధైర్యాన్ని పెంచుతాం
= డాక్టర్ చేతన, డీసీపీ, పెద్దపల్లి జిల్లా
భరోసా సెంటర్ల ద్వారా మహిళల్లో మనోధైర్యాన్ని పెంచుతాం. బాధిత మహిళలు ధైర్యంగా పిర్యాదు ఇవ్వాలి. చాలా చోట్ల మహిళలు, బాలికలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఎలాంటి ప్రాబ్లం అయినా పోలీసుల దృష్టికి తీసుకురావాలి. బాధితుల ఉనికి బయటకు రానివ్వం, ఇన్వెస్టిగేషన్ పూర్తిగా సీక్రెట్‌గా జరుగుతుంది. బాధితులకు లీగల్, మెడికల్ సర్వీసులతో పాటు ప్రభుత్వం నుంచి పరిహారం కూడా అందివ్వడం జరుగుతుంది.
