(జనరక్షణ న్యూస్)
**పకడ్బందీగా మొదటి దశ ఈవిఎం ర్యాండమైజేషన్ పూర్తి – జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*
**మొదటి దశ ర్యాండమైజేషన్ లో జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఈవిఎం యంత్రాల కేటాయింపు*
**ఆన్ లైన్ ద్వారా మొదటి దశ ఈవిఎం యంత్రాల ర్యాండమైజేషన్ నిర్వహించిన జిల్లా కలెక్టర్*
లోక్ సభ ఎన్నికలలో వినియోగించే ఈవిఎం యంత్రాల మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అదనపు కలెక్టర్లు జే అరుణశ్రీ, జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ లతో కలిసి ఈవిఎం యంత్రాల మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టారు.
*జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ,* ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా ఈవిఎం యంత్రాల మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేపట్టామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో మొదటి దశ ఈవిఎం యంత్రాల ర్యాండమైజేషన్ ప్రక్రియ జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో, రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో జరుగుతుందని అన్నారు.
ఈవీఎం యంత్రాల ర్యాండమైజేషన్ మొదటి దశలో జిల్లా ఎన్నికల అధికారి జిల్లాలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కేటాయించడం జరుగుతుందని, రెండవ దశలో ఈవీఎం యంత్రాలను రిటర్నింగ్ అధికారి పోలింగ్ కేంద్రాల వారీగా కేటాయింపు చేస్తారని అన్నారు.
పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 290, మంథని అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 290, రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో 260 పోలింగ్ కేంద్రాలకు ప్రస్తుతం ఈవీఎం యంత్రాలను కేటాయించడం జరుగుతుందని అన్నారు.
ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల ప్రకారం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మనకు అవసరం ఉన్న బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు కంటే 25 శాతం అదనంగా, వివిప్యాట్ లు 40 శాతం అదనంగా కేటాయించడం జరుగుతుందని, వీటిని కలిపి ర్యాండమైజేషన్ చేసామని, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆన్ లైన్ విధానం ద్వారా పారదర్శకంగా ర్యాండమైజేషన్ చేశామని అన్నారు.
మొదటి ర్యాండమైజేషన్ సంబంధించి హర్డ్ కాపీలు, సాఫ్ట్ కాపీలు రాజకీయ పార్టీల ప్రతినిధులకు కలెక్టర్, అదనపు కలెక్టర్ లు అందించారు, ఈ.వి.ఎంలు నియోజకవర్గ కేంద్రంలో ఉన్న స్ట్రాంగ్ రూంకు తరలించే సమయంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేస్తామని అన్నారు.
లోక్ సభ ఎన్నికలు దగ్గరవుతున్న నేపథ్యంలో నామినేషన్ సమయంలో పాటించాల్సిన నియమ, నిబంధనలు, ఎన్నికల ప్రచార ఖర్చుల నమోదు మార్గదర్శకాలు, గరిష్ట ఎన్నికల ప్రచార ఖర్చు పరిమితి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గుర్తించిన స్టార్ క్యాంపెనర్ల ప్రచార ఖర్చు నమోదు మార్గదర్శకాలను కలెక్టర్ వివరించారు.
హెలిపాడ్ కోసం అనుమతులను జిల్లా ఎన్నికల అధికారి అందిస్తారని, పార్లమెంటు స్థాయిలో వినియోగించే వాహనాలకు రిటర్నింగ్ అధికారి, జిల్లాలో వినియోగించే వాహనాలకు జిల్లా ఎన్నికల అధికారి అనుమతి ఇస్తారని, స్టార్ క్యాంపెనర్ల ప్రచార సమయంలో వారు వినియోగించే వాహనాల ఖర్చు పార్టీ పరిధిలో జమ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
- ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారులు బి.గంగయ్య, వి. హనుమా నాయక్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, కలెక్టరేట్ ఏ. ఓ. శ్రీనివాస్, డిప్యూటీ తహశీల్దార్ ప్రవీణ్, ఈ.డి.ఎం. కవిత, తదితరులు పాల్గొన్నారు.
