గాయత్రి విద్యార్థుల ఆర్థిక సాయం

Uncategorized

*నిరాశ్రయులకు గాయత్రి విద్యానికేతన్ విద్యార్థుల రు. 5000 ఆర్థిక సహాయం*

ఇటీవల పెద్దపల్లి పట్టణం లోని హనుమాన్ నగర్ లో దారవేని రవి నివసిస్తున్న ఇల్లు గత బుధవారం రోజు జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. ఈ సందర్భంగా మానవతా దృక్పథంతో స్పందించిన గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ వారికి ఆర్థికంగా చేయూతనివ్వాలనే ఆలోచనతో పాఠశాల విద్యార్థులకు సమాచారం ఇవ్వగా విద్యార్థులు స్పందించి సేకరించిన రు. 5000 లను ఈ రోజు నిరాశ్రయులైన నిరుపేద దంపతులు రవి – రాజేశ్వరి లకు విద్యార్థుల చేతుల మీదుగా పాఠశాల ప్రాంగణంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు పూర్తిగా కాలిపోయి నిలువ నీడ లేకుండా పోయిన దారవేని రవి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఒక ఆలోచనతో విద్యార్థులు రు. 5000 సేకరించడం వారి సేవా గుణాన్ని తెలుపుతుందని, విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, రజియుద్దీన్, పిఇటి స్రవంతి పాల్గొన్నారు.