*స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమాన్ని పక్కా కార్యాచరణతో నిర్వహించాలి……
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష*
**ఆగస్టు 5 నుంచి 9 వరకు స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమ నిర్వహణ*
**పారిశుధ్య నిర్వహణ, గ్రీనరీ పెంపు లక్ష్యాలుగా స్వచ్చదనం-పచ్చదనం*
**స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమ నిర్వహణ పై సంబంధిత బృందాలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్*
——————————-
పెద్దపల్లి , ఆగస్టు -02:
——————————-
మన జిల్లాలో స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమాన్ని పక్కా కార్యాచరణతో నిర్వహించాలని, ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో స్వచ్చదనం- పచ్చదనం కార్యక్రమం పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి పాల్గొన్నారు.
ఆగస్టు 5 నుంచి 9 వరకు స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమం క్రింద గ్రామాలు, పట్టణాలలో చేపట్టాల్సిన కార్యక్రమాల వివరాలు, షెడ్యూల్ ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వివరించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ* మన గ్రామాలను, పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమాన్ని ఆగస్టు 5 నుంచి 9 వరకు నిర్వహిస్తుందని అన్నారు.
స్వచ్చదనం -పచ్చదనం క్రింద గ్రామాలలో పారిశుధ్య , త్రాగు నీటి సరఫరా, త్రాగు నీటి సరఫరా, ఇంకుడు గుంతల నిర్మాణం, మురికి కాల్వలను, నీటి నిల్వ ప్రాంతాలను శుభ్రం చేయడం, గుంతలను పూడ్చడం, సీజనల్ వ్యాధుల నియంత్రణ పై అవగాహన, వీధి కుక్కల దాడుల నివారణ చర్యలు, డ్రై డే, ప్రభుత్వ సంస్థలను శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలు పక్కాగా అమలు చేయాలని అన్నారు.
జిల్లాలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిస్థాయిలో నియంత్రించాలని, కొంతమంది పంచాయతీ కార్యదర్శులు ఇతర సిబ్బంది ప్లాస్టిక్ నియంత్రణలో కృషి చేశారని, స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమం ద్వారా పూర్తి స్థాయిలో సింగల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలని, దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని, గ్రామాలకు , పట్టణాలకు వచ్చే దారుల వెంబడి ప్లాస్టిక్ చెత్త కనిపించవద్దని కలెక్టర్ పేర్కొన్నారు.
గ్రామాలలో ఉన్న మల్టీ పర్పస్ వర్కర్లను వినియోగించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. మన గ్రామాలలో ఉన్న సెగ్రిగేషన్ షెడ్ , డంపింగ్ యార్డ్ లను వినియోగంలోకి తీసుకొని రావాలని కలెక్టర్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు , మార్కెట్ మొదలగు పబ్లిక్ ప్లేసెస్ శుభ్రం చేయాలని , పిచ్చి మొక్కలను తొలగించాలని అన్నారు.
జిల్లా వ్యాప్తంగా కూలిపోయే స్థితిలో ఉన్న ప్రభుత్వ భవనాలను స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా తొలగించాలని కలెక్టర్ తెలిపారు. ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేస్తూ స్వచ్చదనం – పచ్చదనం లో నిర్దేశించిన కార్యక్రమాలను అమలు చేయాలని, అవసరమైన చోట శ్రమదానం నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో నిర్వహించే శ్రమదానం కార్యక్రమానికి కనీసం 50 మంది పాల్గొనేలా చూడాలని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలోని గ్రామాలలో ఉన్న రోడ్ల గుంతలను పూడ్చి వేయాలని, అవసరమైన రోడ్ల మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని, దీని పై ప్రత్యేక అధికారులు శ్రద్ధ వహించాలని కలెక్టర్ తెలిపారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం లచే జిల్లాలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
దోమల నియంత్రణ కోసం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా పాటించాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం చేయాలని, అదేవిధంగా మురికి కాలువలో, అధికంగా ఉన్న ప్రాంతాలలో దోమలు రాకుండా ఆయిల్ బాల్స్ వేయాలని కలెక్టర్ తెలిపారు.
అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా నాటే మొక్కలు తప్పనిసరిగా ఎత్తైనవి ఉండాలని, చాలా చోట్ల ఎత్తు తక్కువ ఉన్న మొక్కలు గమనించడం జరిగిందని, సంబంధిత అధికారులు వెంటనే ఆ మొక్కలు రిప్లేస్ చేయాలని కలెక్టర్ సూచించారు. పెద్దపల్లి మంథని రోడ్డు పక్కన ఏ రాఘవపూర్ దాటిన తర్వాత మొక్కలను పరిశీలించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
త్రాగు నీటి సరఫరా నాణ్యత పరీక్షలను రెట్టింపు చేయాలని అన్నారు. జిల్లాలోని రెసిడెన్షియల్ గురుకుల విద్యాసంస్థలు, సంక్షేమ హాస్టల్ లో పారిశుధ్యం మరింత మెరుగ్గా అమలు చేయాలని, వీటిని మండల ప్రత్యేక అధికారులు తనిఖీ చేసి అక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు.
స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మానవ వనరులు ఇతర సామాగ్రిని సమకూర్చుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి ఆశా లత, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కే రవీందర్, మున్సిపల్ కమిషనర్ లు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, జిల్లా అటవీ అధికారి శివయ్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
——————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది.
