జనరక్షణ న్యూస్
టీబీ రహిత సమాజ నిర్మాణం కోసం అందరు కృషి చేయాలని పెద్దపల్లి జిల్లా టీబీ సీనియర్ చికిత్స పర్యవేక్షకులు దేవ తిరుపతి అన్నారు. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో, ఆయుష్మాన్ కొత్తపల్లి ఆరోగ్య మందిర్ పరిధిలో క్షయ రహిత సమాజాన్ని సాధించేందుకు శుక్రవారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు అధికారులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం అవసరమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని దేశంలో 324 జిల్లాల్లో నిర్వహిస్తుందని, అందులో పెద్దపెల్లి జిల్లా ఉందని, దానిని పెద్దపల్లి జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. దీర్ఘకాలిక వ్యాధిగ్ర స్తులలో స్క్రీనింగ్ పరీక్షలు చేసి, రోగ లక్షణాలున్నటువంటి వారి నుండి కఫాన్ని సేకరించి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ అన్న ప్రసన్న కుమారి, ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ కె,వి.సుధాకర్ రెడ్డి, ఆర్డీపీఎం.ప్రభాకర్, ఎంఎల్హెచ్పి, శ్రీ హర్ష , హెచ్ఈఓ సాంబయ్య, తిరుపతమ్మ, ఏఎన్ఎం.సరోజ, ఆశాలు సరోజ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
