*విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన భోజనం అందించాలి… జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష*
*రంగంపల్లి మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్*
————————————–
పెద్దపల్లి,2026, నవంబర్-12: జనరక్షణ
————————————–
గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన భోజనం అందించాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* అన్నారు.
గురువారం పెద్దపల్లి పట్టణ పరిధిలోని రంగంపల్లిలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను సాయంత్రం జిల్లా *కలెక్టర్ కోయ శ్రీ హర్ష**ఆకస్మికంగా సందర్శించారు.
పాఠశాల, కళాశాల ఆవరణ, తరగతి గదులు, వంటశాల, డైనింగ్ హాల్ , వసతి గృహ పరిసరాలను పరిశీలించి,విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు.
*ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడుతూ వారి విద్యాభ్యాసం, వసతి, భోజన నాణ్యత ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం ప్రతిరోజూ రుచికరమైన, పరిశుభ్రమైన భోజనాన్ని అందించాలని నిర్వాహకులకు ఆదేశించారు.
విద్యార్థులకు ఏవైనా మౌలిక వసతులు ఇతర అవసరాలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థినులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పాఠశాల ప్రిన్సిపాల్ మణి దీప్తి,ఉపాధ్యాయులు, తదితరులు , పాల్గొన్నారు.
