ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ కలర్

Telangana

07pdpl02
====================

ప్రైవేటు బడులకు కార్పోరేట్​ కలర్​
= స్టేట్​ సిలబస్​ను పక్కన పెడుతున్న స్కూల్స్​
= సీబీఎస్సీల పేరుతో నిలువు దోపిడి
= దుఖానాలుగా మారిన విద్యాలయాలు
= ఎక్స్​ట్రా యాక్టివిటీస్​ పేరుతో కలెక్షన్స్​
= పట్టించుకోని విద్యాశాఖ అధికారులు

(జనరక్షణ ప్రత్యేక ప్రతినిధి)

ప్రభుత్వం ఎన్ని రకాల విద్యాసంస్థలు పెట్టినా, ప్రైవేటు విద్యా సంస్థలకే మెజారిటీ పేరెంట్స్​ ఇంపార్టెన్స్​ ఇస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు విద్యా సంస్థలు గడిచిన రెండేళ్లుగా ప్రైవేటు స్కూళ్లకు కార్పోరేట్​ కలర్​ ఇచ్చేసి నడిపిస్తున్నారు. ఫీజుల నుంచి మెయింటనెన్స్​ వరకు కార్పోరేటును తలపిస్తున్నాయి. కానీ ఎడ్యుకేషన్​ స్టాండర్డ్​ విషయంలో ఫెయిల్​ అవుతున్నాయి. సీబీఎస్సీ అనుమతులు లేని స్కూల్స్​ కూడా సీబీఎస్సీ పేరుతో స్టేట్​ సిలబస్​ను చెప్పకుండా ఎక్కడా లేని సిరీస్​ను తీసుకొచ్చి విద్యార్థులకు వేల రూపాయలకు అంటగడుతున్నారు. ప్రైవేటు స్కూల్స్​ అన్నీ దుఖానాలుగా మారిపోయాయాయి. బుక్స్​, బట్టలు, షూస్​, స్టేషనరీ అన్నీ స్కూల్స్​ మేనేజ్​మెంట్స్​ అమ్ముతున్నారు. అయినా కూడా జిల్లా విద్యాశాఖాధికారులు మాత్రం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నెలకు నాలుగు చొప్పున ఎక్స్​ట్రా యాక్టివిటీస్ ( కలర్స్​ డేస్​) ​ చేస్తూ స్టూడెంట్స్​ నుంచి అదనంగా వసూళ్లు చేస్తున్నారు. ఎకాడమిక్​ స్టార్ట్​ అయిన నాటి నుంచి ఎండ్​ అయ్యే వరకు పేరెంట్స్​ తమ పిల్లల మీద పెట్టుబడి పెట్టుడే అయితంది. గతంలో మాధిరిగా స్టూడెంట్స్​లో ఉన్న టాలెంట్​కు పదును పెట్టే లాగా ఓపన్​ స్కూల్​ కాంపిటిషన్స్​( గేమ్స్​, క్విజ్​, వ్యాసరచన, స్పీచ్​) లేకుండా చేశారు. కరోనాకు ముందు బడ్జెట్​ స్కూళ్లుగా చెప్పుకునే ప్రైవేటు విద్యా సంస్థలు అన్నీ ప్రస్తుతం కార్పోరేట్​ స్కూళ్లుగా మారిపోయాయి. పేరెంట్స్​ను నిలువు దోపిడి చేస్తున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు పేరెంట్స్​ నుంచి వస్తున్నాయి.

స్కూల్లల్లోనే అమ్మకాలు…

అకాడమిక్​ స్టార్టింగ్​ నుంచే విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి వివిధ రకాల్లో వసూళ్లకు పాల్పడుతున్నారు. స్కూల్​ స్టూడెంట్స్​కు యూనిఫాం అనేది గతంలో ఒకే కలర్​తో ఉండేది, కానీ ప్రస్తుతం కార్పోరేట్​ కలర్​ వేసుకున్న ప్రైవేటు స్కూల్లలో విద్యార్థులకు నాలుగు రకాల స్కూల్​ యూనిఫామ్స్​ ఇస్తున్నారు. అవన్నీ ఆయా స్కూల్లలోనే అమ్ముతున్నారు. నాలుగు యూనిఫాంలకు రూ. 5 వేలు పైగా వసూలు చేస్తున్నారు. అలాగే పుస్తకాలు కూడా ఒక స్కూల్​కు మరో స్కూల్​కు సంబంధం లేకుండా డిఫరెంట్​ సిరీస్​ను పిల్లలతో కొనిపిస్తున్నారు. 1 నుంచి 5 వ తరగతి వరకు ప్రభుత్వ పుస్తకాలతో సంబంధం లేకపోవడంతో ప్రైవేటు స్కూల్​ యాజమాన్యాలు వారికి నచ్చిన సిలబస్​ను పిల్లలపై బలవంతంగా రుద్దుతున్నారు. 1 నుంచి 5 వ తరగతి విద్యార్థుల బుక్స్​ రూ. 5 వేల వరకు వసూలు చేస్తున్నారు. అకాడమిక్​ ఇయర్​ స్టార్టింగ్​లోనే ఒక ప్రైమరీ విద్యార్థికి బట్టలు, పుస్తకాలు, స్టేషనరీతో దాదాపు రూ. 15 వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. స్కూల్​ ఫీజులు కూడా పేరెంట్స్​ను బయపెట్టేలా ఉన్నాయి. నర్సరీ విద్యార్థికి రూ. 14 వేలు తీసుకుంటున్నారు, ఒక్కో క్లాసుకు రూ.1 వేయి చొప్పున పెంచుకుంటు పోతున్నారు. 5 వ తరగతి విద్యార్థికి రూ. 20 వేలు వసూలు చేస్తున్నారు. ఆ పై తరగతులు ఒక్కోదానికి రూ. 5 వేల వరకు పెంచుకుంటు పోతున్నారు. ప్రైవేటు స్కూల్లలో జరుగుతున్న వ్యవహారం మీద విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

అనవసరమైన యాక్టివిటీస్​….

విద్యార్థికి ఉపయోగం లేని యాక్టివిటీస్​తో తమ విద్యా సంస్థలకు ప్రచారాన్ని పెంచుకుంటున్నారు. నెలలో నాలుగు రోజులు వివిధ కలర్స్​ డేలు, ఫుడ్​ ఫెస్టివల్స్​ లాంటివి నిర్వహిస్తున్నారు. దీని కోసం ప్రతీ విద్యార్థి నుంచి రూ. 50 వసూలు చేస్తున్నారు. గతంలో ప్రతి ఏడాది ఒకసారి మాత్రమే విద్యార్థులను పిక్నిక్​ తీసుకెళ్లేవారు. కానీ ప్రస్తుతం చాలా స్కూల్​ యాజమాన్యాలు సంవత్సరంలో నాలుగైదు సార్లు పిక్నిక్​ పేరుతో విద్యార్థులను వివిధ ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. దాని కోసం విద్యార్థుల నుంచి రూ. వందల్లో వసూలు చేస్తున్నారు. ఎడ్యుకేషన్​కు ప్రాధాన్యమిచ్చే అంశాలను పక్కన పెట్టి అనవసరమైన యాక్టివిటీస్​తో పేరెంట్స్​ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గతంలో స్కూల్లలో విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండే కాంపిటిషన్స్​ నిర్వహించే వారు. అలాగే పట్టణ, మండల, జిల్లా స్థాయి ఓపన్​ స్కూల్​ కాంపిటిషన్స్​ లో బాగంగా గేమ్స్​, వ్యాసరచన, క్విజ్​, స్పీచ్​ పెట్టేవారు. కార్పోరేట్​ సిస్టం వచ్చిన తర్వాత విద్యార్థులు అలాంటి పోటీలకు దూరమయ్యారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలను, జిల్లా విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేయకుండా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపనలు ఉన్నాయి.