ప్రైవేటు స్కూళ్ల ఆకస్మిక తనిఖీ

Hyderabad

ప్రైవేటు స్కూళ్ల ఆకస్మిక తనిఖీ
= అసంతృప్తి వ్యక్తం చేసిన ఇంచార్జీ ఎంఈఓ స్వరూప

(జనరక్షణ, కాల్వ శ్రీరాంపూర్​)

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్​ మండలంలోని ప్రైవేటు పాఠశాలలను ఆ మండల ఇంచార్జీ ఎంఈఓ స్వరూప సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఇంచార్జీ ఎంఈఓ పాఠశాల్లో ఉన్న టాయిలెట్లు, మంచినీటి సౌకర్యం, ఆటస్థలం పరిశీలించారు. అలాగే స్కూల్​ రికార్డులు, తరగతి గదులను పరిశీలించారు. పాఠశాలల నిర్వహణపై ఎంఈఓ అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా స్కూల్స్​లో ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని ఎంఈఓ గుర్తించారు. నిబంధనలు పాటించని స్కూల్స్​ వివరాలు జిల్లా విద్యాశాఖకు పంపనున్నట్లు ఇంచార్జీ ఎంఈఓ స్వరూప తెలిపారు. తనిఖీలో మండల రిసోర్స్​ పర్సన్​ రమేష్​ ఉన్నారు.